హగ్గులతో కాటేస్తున్న మణికంఠ.. ఈసారి అంతకుమించి!
on Oct 12, 2024
బిగ్ బాస్ హౌస్ లో క్రైయింగ్ స్టార్ మణికంఠ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముందు ఎవరు బాధపడిన తన మనసు నొచ్చుకుంటుంది.. మృధుస్వభావి.. అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. హౌస్ లో మొదటి నుండి యష్మీకి మణికంఠకి అసలుపడదు. ఆ విషయం ప్రతీ నామినేషన్ లో ఋజువు చేస్తున్నారు.
హౌస్ లో ఉన్నన్ని రోజులు నామినేషన్ చేస్తానని యష్మీ అందరిముందే చెప్పింది. అయితే ఒకానొక సందర్బంలో మణికంఠతో యష్మీ చిన్న గొడవ కాగా దాంతో యష్మీ పక్కకు వెళ్ళి ఏడుస్తుంది. అప్పుడే మణికంఠ తన వెనకే వచ్చి తనని హగ్ చేసుకుని.. ఏడవకు అనగానే.. ఫస్ట్ వదులు అని యష్మీ అంటుంది. అయిన వదలడు. కాసేపు వదులు అని గట్టిగా అనగానే మణికంఠ వదిలేస్తాడు. ఆ తర్వాత తను వచ్చి అలా హగ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ యష్మీ, పృథ్వీ మాట్లాడుకోవడం బిగ్ బాస్ మామ టీవీలో కూడా వేశాడు. అయితే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున.. వీకెండ్ లో మణికంఠని యాక్షన్ రూమ్ కి పిలిపించి మరీ యష్మీ తను ఇబ్బంది పడ్డ వీడియోని ప్లే చేసి చూపిస్తాడు. ఇంకొకసారి అలాంటివి చెయ్యకంటు చిన్న వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు సరే అన్నాడు మణికంఠ. అయితే గత వారం సోనియా వెళ్ళినప్పుడు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తుంటే.. మళ్ళీ మళ్ళీ హగ్ చేసుకోవడంతో ట్రోల్స్ లో నిలిచాడు ఈ బక్క స్టార్.
కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో నయని మెగా చీఫ్ టాస్క్ నుండి తప్పుకోవడంతో.. అందరు తనని టార్గెట్ చేసారని ఏడుస్తుంటుంది. ఇక మన ప(క)సికూన మణికంఠ తన దగ్గరికి వెళ్లి వెనకాల నుండి హగ్ చేసుకొని.. సానుభూతి చూపిస్తాడు. మళ్ళీ రోహిణి టాస్క్ నుండి తప్పుకుంటుంది. నన్ను విష్ణుప్రియ టార్గెట్ చెయ్యడం అనేది హర్టింగ్ అంటూ సీత ఏడుస్తుంటే.. హౌస్ లో ఎవరు తన దగ్గరికి వెళ్లరు కానీ మన ప(క)సికూన.. మణికంఠ తన దగ్గరికి వెళ్లి మళ్ళీ రోహిణి వెనకాల నుండి హగ్ చేసుకొని సానుభూతి చూపిస్తాడు.
అయితే హౌస్ లో ఎవరు ఇలా చెయ్యలేదు.. చెయ్యరు కూడా.. కానీ మన మణికంఠ చూపించే సానుభూతిని బిగ్ బాస్ ప్రతిదీ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ పసికూనకి నాగార్జున వార్నింగ్ ఇచ్చిన కూడా అలానే చేస్తున్నాడు. ఇక ఈ వారం కూడా మళ్ళీ నాగార్జునతో చివాట్లు తింటాడో లేదో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.